Harish:రాజకీయాలు మాని..ప్రజలకు సాయం చేయండి

4
- Advertisement -

ప్రజలు కష్టాల్లో ఉన్నారు సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంట్లో వరద నీరు, కంట్లో ఏడతెగని కన్నీరు. వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు,కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోవడం పై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలి. ఇప్పటికే తక్షణ సహాయ చర్యలు అందలేదని జనం తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అన్నారు.

ప్రభుత్వం బాధ్యతాయుతంగా మనసుపెట్టి చర్యలు తీసుకోవాలి వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలి. విద్యుత్ సరఫరాను పునర్దరించాల్సిన చోట వేగంగా చర్యలు తీసుకోవాలి. ఆహారం నీరు అందుబాటులో ఉంచాలన్నారు. అసలే రాష్ట్రం విష జ్వరాలతో విలువిలలాడుతుందని… వరదల వల్ల మరింత విజృంబిచే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు హరీశ్‌.

Also Read:తెలంగాణ కాంగ్రెస్ పోస్టులపై సుప్రీం విస్మయం!

- Advertisement -