రైతులకు నీళ్లు నిల్.. లిక్కర్‌కు నీళ్లు ఫుల్ అని సీఎం రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏడాదిలో సింగూరు ప్రాజెక్టు రిపేర్ చేస్తే నీళ్లు నిలువ చేసే వాళ్లు కదా?.. సింగూరు ప్రాజెక్టులో ఉన్న రెండు టీఎంసీల నీళ్లను తాగునీటి కోసం వాడకుండా, లిక్కర్ ఫ్యాక్టరీలకు సప్లై చేస్తున్నారు..రాబోయే రోజుల్లో మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో తాగునీటి కష్టాలు వస్తే ఏం చేస్తారు? అని ప్రశ్నించారు.
సమ్మక్క బ్యారేజ్ ద్వారా ఏపీకి నీళ్లు తరలిపోతున్నాయి…దేవాదుల ద్వారా నీళ్లు ఎత్తిపోసి ఉంటే ఈరోజు వరంగల్ జిల్లాలో కరువు ఉండేది కాదు అన్నారు.30 వేల క్యూసెక్కుల నీళ్లు ఈ సమయానికి కూడా ఏపీకి తరలిపోతున్నాయి… మోటర్లను ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నడపడం వల్ల దేవాదుల ప్రాజెక్టులో రెండు మోటర్ల బేరింగులు దెబ్బతిన్నాయి..మిగిలిన 8 మోటర్లు కూడా కేవలం 8 గంటలే నడుస్తున్నాయి అన్నారు.
రైతులు కరువుతో అల్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడు…రైతు వేదికల దగ్గరకు రైతులందరూ రావాలి, ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యేలకు అర్ధరాత్రి మెసేజ్‌లు పంపించారు అన్నారు. మంత్రులు, రేవంత్ రెడ్డి అందరూ ఢిల్లీ, గోవా టూర్లలో బిజీగా ఉన్నారు..ఇంత సీరియస్ ఇష్యూపై చిన్న పిల్లల ఆటలు ఆడతారా?..రైతులంటే అంత చులకన భావం ఎందుకు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:టీ20ల్లో తిలక్ అరుదైన ఘనత..

