రేవంత్‌ అరాచకాలపై రాహుల్‌కు ఫిర్యాదు!

3
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి తిరుగుబాటు జెండా ఎగరేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సింగరేణి సంస్థలో మూడేళ్లుగా భారీ అవినీతి జరుగుతోంది..రేవంత్ రెడ్డి హయాంలో సింగరేణి మూతపడే దుస్థితికి వచ్చింది అని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాల గురించి రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తానని…సుశీ ఇన్‌ఫ్రా సంస్థ రూ.600 కోట్లు తక్కువ బిడ్ చేసినా, ఆంధ్రా కంపెనీలకు రేడియల్ రోడ్ల కాంట్రాక్టులు ఇచ్చారు…రేవంత్ రెడ్డి కార్యాలయం నుంచి మాకు ఫోన్ చేసి టెండర్ వేయొద్దని చెప్పారు అన్నారు.

నాగార్జున కన్‌స్ట్రక్షన్స్, BVSR, GKC అనే మూడు ఆంధ్రా కంపెనీలకే టెండర్లు ఇచ్చారు.. మా సంస్థకు టెండర్ ఇస్తే రూ.600 కోట్లు ప్రజాధనం మిగిలేది అన్నారు. తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకునేందుకు, కమీషన్లు దండుకునేందుకే తక్కువ బిడ్ చేసిన మా సంస్థకు టెండర్ ఇవ్వలేదు అని ఆరోపించారు.

కావాలనే ఒక సంతకం సాకుతో మా టెండర్ తిరస్కరించారు.. ఆ సంతకాన్ని వెంటనే తెచ్చి ఇచ్చినా తిరస్కరించారు..అందుకే వెంటనే కోర్టులో పిటిషన్ వేశాను. ప్రభుత్వం తరఫున వాళ్లు ముకుల్ రోహత్గీని నియమించుకున్నారు అన్నారు రాజగోపాల్ రెడ్డి.

Also Read:టీ20ల్లో తిలక్ అరుదైన ఘనత..

- Advertisement -