Harishrao:కేసీఆర్ త్యాగాల ఫలం తెలంగాణ

3
- Advertisement -

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో అని నినాదమిచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్‌ గారు తెగించిన రోజు నేడు అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమం సాగించి..స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సందర్భం అన్నారు.

ఇన్నేళ్ళు గడిచినా ఆ నాటి పరిస్థితులు ఇంకా నా ముందు కదలాడుతూనే ఉన్నాయి. కేసీఆర్ గారి చిత్తశుద్ధి, నిబద్ధత వల్లే రాష్ట్రం సాధ్యమైందన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు తన ‘The Coalition Years: 1996-2012’ పుస్తకంలో కెసిఆర్ గారి నిబద్ధత గురించి ఇలా ప్రస్తావించారు అన్నారు.

కేంద్ర మంత్రిగా మీకు ఏ శాఖ కేటాయించాలి అని అడిగినప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన సమాధానం.. “ప్రణబ్‌జీ, నా లక్ష్యం మీకు తెలుసు. నాకు ప్రత్యేక తెలంగాణ కావాలి. మీరు నాకు ఏ శాఖను కేటాయించారనేది ముఖ్యం కాదు. మీరేది కేటాయించినా నాకు సమ్మతమే. కానీ దయచేసి తెలంగాణను ఇవ్వండి.” ఇదీ కేసీఆర్ అంటే. ఇదీ ఆయన కమిట్మెంట్ అన్నారు. కేసీఆర్ త్యాగాల ఫలం తెలంగాణ. కెసిఆర్ ఉద్యమ ఫలితం తెలంగాణ అన్నారు.

 

Also Read:అన్ని చోట్లా ఒకే పార్టీ గెలవాలి అని లేదు: భట్టి

- Advertisement -