ప్రజలు కేసీఆర్‌నే కోరుకుంటున్నారు: హరీష్‌

3
- Advertisement -

పటాన్ చెరు నియోజక వర్గ BRS ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో సందర్భంగా రుద్రారం గణేష్ గడ్డ వద్దకు పాదయాత్ర చేపట్టారు. భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి దంపతుల పాదయాత్రకు తరలివచ్చారు బిఆర్ఎస్ శ్రేణులు.

పటాన్ చెరు అంబేద్కర్ విగ్రహానికి పూల‌మాల వేసి గణేష్ గడ్డ వరకు పాదయాత్రను చేసిన సింధు ఆదర్శ్ రెడ్డి దంపతులు.పాదయాత్ర ముగింపు సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, స్ధానిక నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రస్తుతం కేసీఆర్ వైపు చూస్తోంది… రేవంత్ రెడ్డి అసమర్థ పాలన గురించి ప్రజలకు అర్థమైందన్నారు. ఎన్నికలకు ముందు LRS డబ్బు వసూలు రద్దు చెస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎల్ ఆర్ ఎస్ పేరుతో ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు… 58,59 go ను కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెట్టింది, 58,59 GO ల ద్వారా పటాన్ చెరు ప్రాంతం లో వేలాది మంది పేద ప్రజలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చాం అన్నారు.

14 వేల కోట్ల రూపాయలను రైతులకు ఇవ్వకుండా రైతులను మోసం చేశారు… రైతు రుణమాఫీ, 4వేల ఫించను, సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయి.,..13 లక్షల పేదల పిల్లలకు కళ్యాణ లక్ష్మీ ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. రేవంత్ రెడ్డి మాయ మాటలతో కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి మోసం చేశాడు అన్నారు.

Also Read:

 

మెట్రో రైలు, ఫార్మా ప్రాజెక్టులు ముందుకు సాగటం లేదు… కాంగ్రెస్ పాలనలో తాగునీరు, కరెంటు కష్టాలు మొదలయ్యాయి అన్నారు. ఏడాది తిరగకుండానే 1లక్షా50 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు… తెలంగాణ ను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ ది, పదేళ్ల కేసీఆర్ పాలన దేశంలో నంబర్ వన్ గా మారింది.. ధాన్యాగారంగా మారింది అన్నారు. ప్రజలు ప్రస్తుతం కేసీఆర్ ను కోరుకుంటున్నారు… వరంగల్ లో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి అన్నారు.

Also Read:అట్లీతోనే బన్నీ…ఫిక్స్!

- Advertisement -