బీజేపీ నాయకుల దుష్ప్రచారం తగదు:ఎమ్మెల్యే బాజిరెడ్డి

73
bajireddy

కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని కానీ బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేయడం తగదన్నారు.

కరోనా వైరస్ బారిన పడిన బాధితులకు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. బీజేపీ నాయకులు కళ్లుండి కబోదుల్లాగా వ్యవహరిస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఇది వారి అవివేకానికి నిదర్శనమన్నారు.

ఇతర రాష్ట్రాలతో పోలీస్తే తెలంగాణలో కరోనా మరణాలు తక్కువగా ఉండటమే దీనికి నిదర్శనమన్నారు. కరోనా మహమ్మారిని అందరం సమష్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిన బాధ్యతను విస్మరించి దుష్ప్రచారం చేస్తూ రాజకీయం చేయడం తగదన్నారు.