- Advertisement -
సిద్దిపేట జిల్లాలో రెండవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం డ్రై డేలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెటును ఆకస్మికంగా తనిఖీ చేశారు హరీశ్ రావు.
సమీకృత మార్కెటులోని చేపలు, మటన్, చికెన్ ప్రతి ఒక్క దుకాణ సముదాయాలను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఎక్కడా అపరిశుభ్రత ఉండొద్దని నిర్వాహకులకు మంత్రి సూచనలు చేశారు.
దుకాణ దారులు మార్కెట్లో ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే రూ.500 ఫైన్ విధించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీచేశారు. మార్కెటుకు వచ్చే ప్రతి ఒక్కరూ స్టీల్ డబ్బా వెనుక తెచ్చుకోవాలని ప్రజలకు సూచించాలని దుకాణ దారులను ఆదేశించారు.
- Advertisement -