సూపర్ స్టార్ రజనీ ‘కాలా’కు రెండేళ్లు..!

332
kaala
- Advertisement -

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాలా. ముంబైలోని మురికివాడ ధారావిలో సామాన్యుల కష్టాలను తీర్చే నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హీరో ధనుష్ నిర్మించారు. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం జూన్ 7న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచింది.

రజనీ ఛరిష్మా .. నానా పటేకర్ నటనలో సహజత్వం .. హుమా ఖురేషి గ్లామర్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలవగా వసూళ్లలోనూ సత్తాచాటింది కాలా. ప్రపంచవ్యాప్తంగా కేవలం నాలుగురోజుల్లోనే దాదాపుగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

రజనీ గత సినిమాలనే కాదు బాలీవుడ్ సినిమా రికార్డులను కూడా తిరగరాసింది కాలా. ఈ నేపథ్యంలో రజనీ మూవీ కాలాను గుర్తుచేసుకుంటు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌.

- Advertisement -