కరోనా విషయంలో భయం, నిర్లక్ష్యం రెండు వద్దన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి సమీపంలో గల rvm మెడికల్ కళాశాలలో కోవిద్ (కరోనా)వార్డు బ్లాక్ మరియు ల్యాబ్‌ను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు హరీష్.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్..కరోనా కట్టడికి ప్రభుత్వం అన్నిప్రయత్నాలు చేస్తుందన్నారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇంతటి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా అనేక జాగ్రత్తలు చెబుతూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు,
rvm హాస్పిటల్ లో కరోనా వార్డ్స్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైరస్ నియంత్రణకై మస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ పని చేసుకోవాలని దగ్గేటప్పుడు కానీ తుమ్మెటప్పుడు చేతులు అడ్డం పెట్టుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, వైద్యాధికారి కాశీనాథ్, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.