హరీష్ రావు హామీతో వెనక్కితగ్గిన వలసకూలీలు..

213
harishrao
- Advertisement -

మంత్రి హరీష్ రావు హామీతో వెనక్కితగ్గారు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన వలస కూలీలు. లాక్ డౌన్ నేపథ్యంలో తమ స్వస్థలాలకు బయలు దేరిన వారిని మెదక్ జిల్లా మనోహరాబాద్ వద్ద గమనించిన హరీష్‌ వారికి భరోసాగా నిలిచారు.

పని, ఆహారం లేని కారణంగా తమ స్వంత రాష్ట్రాలకు బయలుదేరినట్లు వారు చెప్పారు. తామంత హైదరాబాద్‌ చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి బయల్దేరి గడిచిన ఐదారు రోజుల నుంచి కాలినడకన ప్రయాణం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

దీంతో చలించి పోయిన హరీష్‌..లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎక్కడికి వెళ్లవద్దని కోరారు. మనోహరాబాద్‌లోనే ఆశ్రయం కల్పిస్తానని అన్ని రకాలుగా సాయం అందిస్తామని హరీశ్‌రావు వారికి హామీ కార్మికులు వెనక్కితగ్గారు. హరీష్ చూపించిన చొరవ పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -