ఏఐజీకి హరీశ్‌ రావు..ఆస్పత్రిలో చికిత్స

9
- Advertisement -

హైదరాబాద్ గచ్చిబౌళి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు మాజీ మంత్రి హరీశ్ రావు. నిన్న పోలీస్ తోపులాటలో తీవ్రంగా గాయపడ్డారు హరీశ్‌. చేతి నొప్పితో ఆసుపత్రికి వెళ్తాను అంటే అనుమతించ లేదు పోలీసులు. చాలా సేపు వాగ్వాదం తర్వాత ఏఐజీ ఆస్పత్రికి హరీశ్ రావు వెళ్లారు. ఆయన వెంట పోలీసులు సైతం వెళ్లారు.

AIG లో వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. నిన్నటి ఆందోళనలో ఎడమ భుజానికి గాయం కాగా ఆస్పత్రి వెళ్ళిరావడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు పోలీసులు. హరీష్ రావు గృహ నిర్బంధం అంటూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు పోలీసులు.

Also Read:Chiru: సామాన్య ప్రజల గొంతుక ‘ఏచూరి’

- Advertisement -