ముగిసిన హరీశ్ రావు విచారణ

5
- Advertisement -

కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. దాదాపు 45 నిమిషాల పాటు విచారణ జరుగగా ప్రాజెక్టు రీడిజైనింగ్ కార‌ణాల‌ను క‌మిష‌న్‌కు హ‌రీశ్‌రావు వివ‌రించారు.

మ‌హారాష్ట్ర‌, సీడ‌బ్ల్యూసీ అభ్యంత‌రాల వ‌ల్లే రీడిజైనింగ్ చేసిన‌ట్లు హ‌రీశ్‌రావు చెప్పారు. బీఆర్‌కే భవన్‌కు హరీశ్‌రావుకు మద్దతుగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.

విచార‌ణ‌కు ముందు కోకాపేటలోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్‌ చేరుకున్న హరీశ్‌ రావు.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.

Also Read:కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హరీశ్‌రావు

కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు హరీష్ రావు. ఆధారాలతో సమాధానాన్ని సమర్పించారు.
- Advertisement -