TG: తగ్గనున్న బీరు, మద్యం ధరలు..!

4
- Advertisement -

ఇటీవలె తెలంగాణలో బీరు,మందు ధరలు పెరిగిన సంగతి తెలిసిందే.అయితే త్వరలోనే మద్యం ధరలు తగ్గే అవకాశంఉన్నట్లు తెలుస్తోంది. TGBCL ఆహ్వానించిన దరఖాస్తులకు అనూహ్యమైన స్పందన లభించింది.

మొత్తం 92 కంపెనీలు 604 కొత్త బ్రాండ్లను తెలంగాణ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు ఉత్సాహం చూపాయి. వీటిలో 331 భారతీయ మద్యం బ్రాండ్లు కాగా, 273 విదేశీ బ్రాండ్లు ఉన్నాయి. కొత్తగా 47 కంపెనీలు 386 బ్రాండ్లను ప్రతిపాదించగా, ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న 45 సరఫరా కంపెనీలు మరో 218 బ్రాండ్లను ప్రవేశపెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి.

Also Read:Talasani:మాగంటి మృతి బాధాకరం

ఈ కొత్త బ్రాండ్ల రాకతో మద్యం ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ రూ.34,600 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

- Advertisement -