అభివృద్ధిలో వికారబాద్ జిల్లా ముందంజలో ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. తాండూరు వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఆశా, ANM లకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు హరీశ్. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన…ANM సబ్ సెంటర్లు పల్లె దవాఖానలుగా చేస్తున్నాం. 3200 పల్లె దవాఖాన ఏర్పాటు చేస్తున్నాం. డాక్టర్ లేదా స్టాఫ్ నర్స్ ఇక్కడ ఉండి సేవలు అందిస్తారన్నారు. కొత్త పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా నడుస్తున్నది. సీఎం కేసీఆర్ గారు మిమ్మల్ని ప్రగతి భవన్ పిలిచి, మాట్లాడి మీ కోరిక మేరకు జీతాలు పెంచారని గుర్తుచేశారు. ఎక్కడ 2000, ఎక్కడ 9750 రూపాయలు ఆలోచించాలని కోరారు.
మధ్యప్రదేశ్ లో ఈరోజు కూడా 3000 మాత్రమే ఇస్తున్నారు. ఛత్తీస్ గడ్ లో 4000 ఇస్తున్నారు. మనం మాత్రం 9750 ఇస్తున్నాం అని తెలిపారు. పని చేస్తే ప్రేమగా చూసుకుంటాం.బాగా పని చేసిన వారికి పిలిచి హైదరాబాద్ లో సన్మానం చేశామన్నారు. రూ. 235 కోట్లతో వికారాబాద్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లో 30 కోట్లతో నర్సింగ్ కాలేజీ ప్రారంభిస్తామన్నారు.రూ. 15 కోట్లతో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి వికారాబాద్ లో ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు.
గవర్నర్ వైద్యుల మనో దైర్యం దెబ్బతీసేలా మాట్లాడటం దురదృష్టకరం అన్నారు. ఒక డాక్టర్ అయి ఉండి అలా మాట్లాడటం బాధాకరం. ఇది తగదు.
తెలంగాణలో వైద్యం బాగోలేదని ఎలా అంటారు. తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని అనేక సార్లు వెల్లడించింది….ఒక వైపు కేంద్రం ప్రశంసలు కురిపిస్తే, మీరు విమర్శలు చేస్తారు…మాతా శిశు మరణాలు తగ్గుదలలో తెలంగాణ అగ్ర స్థానంలో కొనసాగుతుందన్నారు.ఏ బిజెపి పాలిత రాష్ట్రంలోనూ ఇంత పురోగతి లేదు. దేశంలో ఆరోగ్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు.