మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో పోడు భూమి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై లబ్దిదారులకు పట్టాలు అందించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..నర్సాపూర్ లో గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని..గిరిజనులకు పోడు పట్టాలు అందజేశారు. మెదక్ జిల్లాలో మొత్తం 517 ఎకరాలకు గాను 610 మంది గిరిజనులకి పోడు పట్టాలు పంపిణీ చేశారు.
పట్టాలు అందుకోవడం వల్ల మీకు 10 ప్రయోజనాలు ఉన్నాయి.
1.ధరణీలో మీ పేరు ఎక్కడం, మీ పాస్ బుక్ రావడం.
2.ఎకరాకు 10 వెలు రైతు బంధు డబ్బులు.
3.ఏ కారణంతో చనిపోయినా రైతు బీమా కింద 5 లక్షలు.
4.అటవీ అధికారుల వేదింపులు ఉండవు.
మీ పై పెట్టిన కేసులు తొలగించేలా సీఎం గారి వద్దకు తీసుకువెళతాము.
5.వారసత్వ హక్కు భూమిపై వస్తుంది.
6.విద్యుత్ కనెక్షన్, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా
7.ఎరువులు, విత్తనాలు, పనిముట్లు సబ్సిడీకి పొందుతారు.
8.అకాల వర్షాలు పడితే ప్రభుత్వం అందించే పంట నష్టం.
9.మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు తెచ్చాం.
మీరు నేటితో అర్హత పొందారు. కోఆపరేటివ్ డైరెక్టర్ గా కావొచ్చు.
10.బ్యాంకుకు వెళ్తే మీకు పాస్ బుక్ ద్వారా క్రాప్ లోన్ తెచ్చుకోవచ్చు అన్నారు.
కేసీఆర్ మాట ఇచ్చారంటే తప్పరు ..పోడు భూముల వ్యవహారం రాష్ట్రం పరిధిలో ఉంటె ఎపుడో పట్టాల పంపిణీ జరిగిపోయేది .కేంద్ర అటవీ చట్టాల సాంకేతిక అంశాలు ఇందులో ఉన్నందునే కొంత ఆలస్యమైందన్నారు. మంచి చేసేది కేసీఆర్ ..ముంచాలనుకునేది కాంగ్రెస్ అన్నారు. మంచి చేసేటోళ్లు కావాలా ముంచేటోళ్లు కావాలా…కాంగ్రెసోళ్లు గిరిజనులకు రిజర్వేషన్లు పెంచలేదు సరికదా కనీసం త్రి ఫేస్ కరెంటు కనెక్టన్లు కూడా ఇవ్వలేకపోయారు అన్నారు.
Also Read:నెదర్లాండ్‌లో కుప్పకూలిన సంకీర్ణ సర్కార్
కేసీఆర్ రిజర్వేషన్లు పది శాతానికి పెంచారు ..కోట్లు ఖర్చు పెట్టి త్రి ఫేస్ కరెంటు ను గిరిజన తండాలు ఆదివాసీ గూడేలకు అందించారన్నారు. రిజర్వేషన్లు పెంచడం వల్ల ఎస్టీలకు విద్యా ఉద్యోగాల్లో ఎంతో మేలు జరుగుతోంది…గురుకులాల సంఖ్య పెరగడం తో గిరిజన ఆదివాసీ బిడ్డలకు కార్పొరేట్ విద్య అందుతోందన్నారు.పెద్ద పెద్ద పేరున్న మెడికల్ కాలేజీలు ,ఐఐటీ ,ఇంజనీరింగ్ కాలేజీల్లో గురుకులాల్లో చదివిన మన గిరిజన బిడ్డలు సీట్లు సంపాదిస్తున్నారు.గిరిజన నివాసాలకు వంద యూనిట్లు వరకు కరెంటు ఉచితంగా అందిస్తున్నాం అన్నారు.
Also Read:ఎన్సీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందా..?