నెదర్లాండ్‌లో కుప్పకూలిన సంకీర్ణ సర్కార్

45
- Advertisement -

నెదర్లాండ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. సంకీర్ణ సర్కార్ కుప్పకూలడంతో ప్రధాని మార్క్ రట్ రాజీనామా చేశారు. దేశంలోకి వలసల నిరోధంపై కూటమిలోని నాలుగు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రధాని మార్క్‌ రట్‌ తనతోపాటు మంత్రిమండలి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను నెదర్‌లాండ్స్‌ రాజు విల్లెమ్ అలెక్సాండర్‌కు అందజేశారు.

వలసలను అడ్డుకునే విషయంలో తమ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందేనని ప్రధాని మార్క్‌ రట్‌ అన్నారు. ఈసారి చర్చల్లోనూ భాగస్వామ్యపక్షాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయని అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు.

Also Read:ప్రభాస్ ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్న’సలార్’?

దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా మార్క్‌ రట్‌ నిలిచారు. 2010లో ఆయన తొలిసారిగా ప్రధాని బాధ్యతలు చేపట్టారు.

Also Read:ఎన్సీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందా..?

- Advertisement -