పేద ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు మంత్రి హరీష్ రావు. కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.బస్తీ దవఖానాల్లో పేద రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం…. ఉచితంగా మంచినీళ్లు అందిస్తున్నాం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని కొంత మంది నాయకులు డబుల్ ఇంజిన్ అని మాట్లాడుతున్నారు.. అసలు డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాల్లో ఇలాంటి డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కొన్ని రాజకీయ పార్టీల జీవితమంతా ధర్నాలే అని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. గత ప్రభుత్వాల హయాంలో నల్లా బిల్లు కట్టకపోతే తెల్లారేసరికి కనెక్షన్ కట్ చేసేవారు. కేసీఆర్ హయాంలో మంచినీళ్లు అందించాం అన్నారు.
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టారా? కలలోనైనా ఊహించారా? డబుల్ ఇంజిన్‌లు అన్ని ట్రబులే తప్పా అక్కడ డబుల్ బెడ్రూం ఇండ్లు లేవు అన్నారు. ఈ దేశంలో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ, మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను మరోసారి దీవించాలన్నారు హరీష్ రావు.
Also Read:‘హరి హర వీర మల్లు’ …పవన్ బర్త్ డే ట్రీట్