ఉమాపతి శర్మ మృతిపట్ల మంత్రి హరీష్ సంతాపం

44
harish

ప్రముఖ కవి, నాటక రచయిత, రేడియో వ్యాఖ్యాత, జ్యోతిష్య విద్యలో ప్రావీణ్యులు.. శ్రీ ‘ఉమాపతి బాలాంజనేయ శర్మ’ పట్ల సంతాపం వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. ఆయన మృతి సాహిత్య సాంస్కృతిక రంగాలకు తీరని లోటు. ఆయన రాసిన “భువన విజయం” పద్య నాటకం జాతీయ స్థాయిలో దూరదర్శన్ ద్వారా ప్రసారమై ఎన్నో ప్రశంసలు పొందిందన్నారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ, వారి కుంటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు.