Harish:కాళేశ్వరంపై ఇంకెన్నాళ్లు దుష్ప్రచారం

5
- Advertisement -

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అనేక అద్భుతాలు సాధించింది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. లండన్‌లో ఎన్నారైలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మాట్లాడిన హరీష్ రావు.. అప్పుడు దేశంలో నానుడి ఉండేది. బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని ఉండేది.. కానీ కేసీఆర్ పాలనతో తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే కాడికి తెచ్చాం అన్నారు.

ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు నల్ల ద్వారా అందించింది కేసీఆర్…. మేనిఫెస్టోలో పెట్టుకోకపోయినా ఇంటికి తాగునీరు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి నల్ల ద్వార నీళ్లికపోతే ఓట్లు అడగను అని చెప్పిన గొప్ప నాయకుడు అని గుర్తు చేశారు.మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకొని సర్దార్ కోచలాని కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. రైతుల కోసం దేశంలోనే నేరుగా నగదు బదిలీ చేసిన ఒకే ఒక కార్యక్రమం రైతుబంధు అన్నారు.

Also Read:జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

2014కి ముందు ఎక్కడ చూసినా రెండు మూడు లక్షలకు మించి ఎకరం ఉండేది కాదు.. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ కూడా 30 నుండి 50 లక్షల ఎకరం తక్కువ లేదు.. ఆంధ్రాలో ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో పదెకరాలు వచ్చేది అని అనేవారు.. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రలో పది ఎకరాలు కొనవచ్చు అనే స్థాయికి తెలంగాణను కేసీఆర్ తీసుకువెళ్లారన్నారు.

కాళేశ్వరం అంటే లక్ష లక్ష కోట్ల రూపాయలు పోయాయని దుష్ప్రచారం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంపు హౌస్‌లు, 203 కిలోమీటర్ల టన్నెలు, 1500 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్ 600 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయడం అన్నారు. మల్లన్న సాగర్ కూలిపోతే కాళేశ్వరం నీళ్లను మూసికి ఎలా తీసుకెళ్తావు రేవంత్ రెడ్డి..? గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశావు.. అక్కడికి సోర్స్ కాళేశ్వరం మల్లన్న సాగరే కదా చెప్పాలని ప్రశ్నించారు.

- Advertisement -