అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి:హరీష్ రావు

208
harish rao
- Advertisement -

కరోనా వైరస్ రోజురోజుకి విస్తరిస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తా లో హరేకృష్ణ మూవ్ మెంట్, మెగా కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కషాయ వితరణ కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌ .. పట్టణంలో ఉచిత కషాయ కేంద్రాన్ని ప్రారంభం చేసుకున్నాం, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.గతంలో పట్టణంలో చలివెంద్రాన్ని ప్రారంభం చేసుకున్నట్లు, నేడు వేడినీరు, కసాయ కేంద్రాన్ని ప్రారంభం చేసుకున్నాం….కరోనా కష్ట కాలంలో ప్రజలు బయటకు రాకూడదు….అత్యవసరమైతే స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.

యోగ , వ్యాయామం చేసే వారు ఆరోగ్యంగా ఉంటున్నారు……సిద్దిపేట కు పనుల కోసం వచ్చే వారి కోసం పట్టణంలో మూడు వేడి నీటి కేంద్రాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. కరోనా నుండి బయట పడాలంటే వేడి నీరు, కషాయం త్రాగితే సులువుగా బయట పడవచ్చు….దీనిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి, అందరూ వేడినీరు కషాయం అలవాటు చేసుకోవాలన్నారు.

కరోనా వచ్చి హోంఐసోలేషన్‌లో ఉన్న వారికి 12 రకాల వస్తువులతో కరోనా కిట్ అందిస్తున్నాం అని వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షల రూపాయల ఖర్చు చేయవద్దున్నారు. ప్రభుత్వం ఇచ్చే సూచనలు తప్పకుండా పాటించాలి*అత్యవరమైతే తప్ప బయటకు రాకూడదన్నారు.

- Advertisement -