తెలంగాణ ప్రజలు వరదల్లో తల్లడిల్లుతుంటే, కాంగ్రెస్ నాయకులు నిద్ర మత్తులో ఉన్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు.మెదక్ జిల్లా ముంపు ప్రాంతాలను పర్యటించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి.
కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ప్రజల మధ్యలో ఉన్నారు… రాజీపేట గ్రామంలో వరదల్లో చిక్కుకుని చనిపోయిన సత్యం కుటుంబాన్ని పరామర్శించింది హరీష్ రావు బృందం. మెదక్, కామారెడ్డి ప్రజలు వరదలలో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మూసీ సుందరీకరణ, ఒలింపిక్స్ ఆటల పోటీల అంశంపై రివ్యూ చేస్తున్నాడు.. ఒక మంత్రి అయితే అత్యవసరమైతే తప్ప హెలికాప్టర్ వాడలేమని అంటున్నారు అన్నారు.
మెదక్ జిల్లా రాజీపేట వరదల్లో చిక్కుకొని ఇద్దరు కరెంటు పోల్ ఎక్కి నాలుగైదు గంటలుగా సహాయం కోసం ఎదురు చూశారు. హెలికాప్టర్ పంపించి ఉంటే వాళ్ళు ప్రాణాలతో దక్కేవారు… చనిపోయిన రెండు కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సహాయం చేయాలి అన్నారు. నష్టపోయిన పంట పొలాలకు ఎకరానికి రూ.25000 చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలి అన్నారు.
మెదక్ ముంపు ప్రాంతాలకు ప్రజలు సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. తాగునీరు లేకపోవడంతో వర్షం నీరు తాగుతున్నారు.. ధూప్ సింగ్ తాండా ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు… కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి అన్నారు.
Also Read:విధులకు ఆలస్యం..తుమ్మల ఆగ్రహం

