నాపై చేసిన ఆరోపణలపై విచారణ చేయించే దమ్ము ఉందా? దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి అని డిమాండ్ చేశారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి.టీటీడీ భూములను టూరిజం శాఖకు ఎందుకు బదలాయిస్తున్నారు చెప్పాలన్నారు.
నాప్రశ్నలకు బీఆర్ నాయుడు సమాధానం ఇవ్వలేదు.. బీఆర్ నాయుడు వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి.. నాప్రశ్నలకు జవాబు చెప్పకుండా బూతులు తిడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ నాయుడు బెదిరింపులకు భయపడేది లేదు.. బీఆర్ నాయుడు అరాచకాలపై పోరాటం చేస్తూనే ఉంటాం.. బీఆర్ నాయుడు చేసిన ఆరోపణలపై విచారణకు సిద్ధం అన్నారు.
టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడు ఉండటం హిందువుల దురదృష్టం.. తప్పుడు ప్రచారానికి బీఆర్ నాయుడు బ్రాండ్ అంబాసిడర్.. క్విడ్ ప్రోకో కింద బీఆర్ నాయుడుకు టీటీడీ ఛైర్మన్ పదవి వచ్చింది అని దుయ్యబట్టారు.
Also Read:గద్వాల్‌లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్..

