కేంద్ర ప్రభుత్వం పోలవరంని జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించినప్పుడు కుడి కాలువ కెపాసిటీ 11,500 క్యూసెక్కులుగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పుడు కుడి కాలువ కెపాసిటీని 23,000 క్యూసెక్కులు అని అంతకంత పెంచారు… జాతీయ ప్రాజెక్ట్ అని హోదా ఇచ్చాక కెపాసిటీని పెంచి కాలువ తవ్వుతుంటే బీజేపీ పార్టీ ఎలా అనుమతినిచ్చింది చెప్పాలన్నారు.
గతంలో కుడి కాలువ కెపాసిటీని 11,500 నుండి 18,000 పెంచినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నిస్తే పనులు ఆగిపోయాయి..కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కెపాసిటీ 23,000కు పెరిగినా ఎవరు అడ్డుకోలేదు, బిల్లులు రిలీజ్ అయ్యాయి అన్నారు.
ఏపీ 463 టీఎంసీల నీళ్లు మళ్లిస్తే నేను మీద 112 టీఎంసీలు ఆపుకుంటా అని కర్ణాటక అంటుంది.. నేను 74 టీఎంసీలు ఆపుకుంటా అని మహారాష్ట్ర అంటుంది అన్నారు.
112 టీఎంసీలు కర్ణాటక, 74 టీఎంసీలు మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంది… మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు.. ఆ నల్లమలను అనుకొని పారే కృష్ణ నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం జరిగితే ఎందుకు మాట్లాడటం లేదు చెప్పాలన్నారు. నువ్వు నల్లమల పులివా, పిల్లివా, ఎలుకవా.. ఎందుకు మాట్లాడటం లేదు … పులి అయితే మాట్లాడేవాడివి.. పిల్లివి, ఎలుకవు కాబట్టి మాట్లాడటం లేదు అన్నారు.
Also Read:

