Harishrao:రూ. 25 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

17
- Advertisement -

ఖ‌మ్మం జిల్లాలోని చింత‌కాని మండ‌లం ప్రొద్దుటూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు బోజ‌డ్ల ప్ర‌భాక‌ర్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభాకర్ ఆత్మహత్య దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్ర‌భాక‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు కాంగ్రెస్ పార్టీనే కార‌ణం అని ఆరోపించారు. త‌న భూమిలోని మ‌ట్టిని జేసీబీ, ప్రొక్లెయిన్‌తో చెల్లాచెదురుగా చేశార‌ని ఎస్ఐ, ఎమ్మార్వో, క‌లెక్ట‌ర్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదని..వారిలో ఏ ఒక్క‌రైనా స్పందించి ఉంటే ప్రభాకర్ బ్రతికుండేవాడన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడని… ఆయ‌న క‌న్నీళ్లు పెట్టుకున్న తీరు చూస్తుంటే చూసిన వారికి కూడా క‌న్నీళ్లు వ‌స్తున్నాయన్నారు. ప్ర‌భాక‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌కులైన వారిపై కేసు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు.ప్రభాకర్ ఇంట్లో ఒక‌రికి ప్ర‌భుత్వ ఉద్యోగం ఇవ్వాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బీఆర్ఎస్ త‌ర‌పున డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Also Read:Revanth:ఢిల్లీకి సీఎం రేవంత్!

- Advertisement -