Harish:రైతు సమస్యలపై కాంగ్రెస్‌ను నిలదీస్తాం

20
- Advertisement -

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం నూతన్ కల్ గ్రామంలో క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులను కలిశారు మాజీ మంత్రి హరీష్ రావు. పంటకు సరిపడా సాగునీరు విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంట విరామం ప్రకటించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు రైతులు.ఖమ్మం జిల్లాలోని ప్రాంతాల్లో క్రాప్ హాలిడే ప్రకటించడం బాధాకరం. రైతులు అన్ని రకాలుగా నష్టపోయారన్నారు.

విత్తనాలు పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది…సాగునీరు అందించడంలో విద్యుత్ సరఫరా చేయడంలో ఫెయిల్ అయిపోయింది,వానకానికి సంబంధించి రైతుబంధు డబ్బులు ఎలాంటి షరతులు లేకుండా కోతులు లేకుండా రైతుల ఖాతాల్లో ఎకరాకు 7500 జమ చేయాలన్నారు.
రాష్ట్రంలో రైతులు అన్ని రకాలుగా నష్టపోయారు. సాగు నీరు కరెంటు సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.

500 బోనస్ ఇస్తానని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అని మాట మార్చింది ప్రభుత్వం. బోనస్ అని బోగస్ చేసిందని..మంత్రులు రోజుకో తీరు మాట్లాడుతున్నారు. వ్యవసాయం మీద అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ తీరు నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్టుందని..99 శాతం పండే దొడ్డు వడ్లకు బోనస్ ఎగపెడతాం, ఒక శాతం పండే సన్నాలకు బోనస్ ఇస్తామనడం ఎంతవరకు సమంజసం. ఇది పూర్తిగా రైతులను మోసం చేయడమేనన్నారు. ఆరు నెలల్లో కాంగ్రెస్కు అహంకారం నెత్తికెక్కింది. అహంకారాన్ని దించాల్సిన అవసరం ఉందన్నారు.వచ్చే అసెంబ్లీ సమావేశాల వేళ హైదరాబాదుకు తరలివచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని రైతుల హెచ్చరిస్తున్నారని తెలిపారు హరీష్. ఛలో అసెంబ్లీ పిలుపునిచ్చి పోరాటం చేస్తామని ,రైతులకు న్యాయం జరిగేదాకా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాల్సిందే. లేదంటే అసెంబ్లీని స్తంభింప చేస్తాం అన్నారు హరీష్.

Also Read:KTR:ఆర్టీసీ ఎండీకి కేటీఆర్ హెచ్చరిక

- Advertisement -