రైతులకు కోతలు..ప్రజలకు వాతలు

1
- Advertisement -

దసరా, దీపావళి పండుగలకు ముందు తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ భారాన్ని మోపేందుకు సిద్ధమైందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంతో ప్రజలపై రూ.5,420 కోట్ల భారం పడనుందని ఆయన పేర్కొన్నారు.

కరువు పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. ఇలాంటి సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా ప్రజలపై మరింత ఆర్థిక భారం మోపడం సరికాదని విమర్శించారు.

రైతులకు కోతలు.. ప్రజలకు వాతలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై అదనపు భారం మోపొద్దని, ఇప్పటికే పెంచిన ఛార్జీలను తక్షణమే తగ్గించాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగం పరిస్థితి దారుణంగా మారిందని ఆయన విమర్శించారు. కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటుకు కరోనా సోకింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అలాగే రాష్ట్రంలో నీటి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలకు, రైతులకు నీటిని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని హరీశ్‌రావు ఆరోపించారు. నీళ్లు ఉండి కూడా ఇవ్వడం చేతగాని ప్రభుత్వం.. ఎల్‌నినో కంటే ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు.విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించి ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పండుగల సమయంలో సామాన్యులపై అదనపు ఆర్థిక భారం మోపడం సరికాదని పేర్కొన్నారు.

Also Read:ఆ సీఎంలకు తొలి పరీక్ష!

- Advertisement -