ఎఫ్‌ 2 బ్లాక్ బస్టర్:హరీష్‌

251
f2 movie
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. ముఖ్యంగా పండగ వేళ సందడి చేసేందుకు ఇప్పటికే బాలయ్య ఎన్టీఆర్ సినిమాతో రాగా రజనీకాంత్ పేట,రాంచరణ్‌ వినయ విధేయ రామ అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చి హిట్ టాక్ సొంతం చేసుకున్నారు.

తాజాగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఎఫ్‌ 2 మూవీ కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాపై ప్రశంసలు గుప్పించారు దర్శకుడు హరీష్ శంకర్. సినిమా బ్లాక్ బస్టర్ అని ట్వీట్ చేసిన హరీష్‌ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఎఫ్ 2లో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. వారి స‌ర‌స‌న త‌మ‌న్నా, మెహ‌రీన్ కౌర్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ‘ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌’ హ్యాట్రిక్ విజ‌యాల త‌ర్వాత అనిల్ రావిపూడి మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకోవ‌డం విశేషం.

- Advertisement -