అగ్రహీరోలు..పెండింగ్ చలాన్లు

153
pawan mahesh

నగరంలో రోజురోజుకి చలాన్లు కట్టని వారిసంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఎప్పటికప్పుడు స్సెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్న పెండింగ్ చలాన్లు మాత్రం వసూలు చేయలేకపోతున్నారు. ఈ జాబితాలో సామన్యూలే కాదు సెలబ్రెటీలు సైతం ఉన్నారు.

సినీ స్టార్లు నందమూరి బాలకృష్ణ, సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌లాంటి అగ్ర హీరోలు ఓవర్‌స్పీడ్‌తో వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో వీరి ఖాతాల్లో చలాన్లు పేరుకుపోయాయి.

వీరిలో అగ్రస్థానం సూపర్ స్టార్ మహేష్ బాబుదే. 7 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన మహేష్ రూ.8,745 పెనాల్టి చెల్లించాల్సి ఉంది. నందమూరి బాలకృష్ణ 2018లో రాజేంద్రనగర్‌ వద్ద అతివేగంతో పయనించడంతో రూ.1,035 ఫైన్‌ వేశారు.
పవన్‌ కళ్యాణ్‌ పార్కింగ్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ మూడు చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

వీరే కాదు సునీల్‌, నితిన్‌ లాంటి హీరోల చలాన్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. మరి ఇప్పటికైన ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న చలాన్లు చెల్లించి ఈ అగ్రహీరోలు మిస్టర్‌ క్లీన్‌గా మారుతారో లేదో చూద్దాం..