గోదావరి నీళ్లు తెచ్చాం.. కరువును దూరం పెట్టామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మండుటెండల్లో కూడా గోదావరి నీళ్లు రావడమనేది ఓ కల అని చెప్పారు. కళ్లముందు నీళ్లు వస్తున్నా ప్రతిపక్షాలకు కనబడటం లేదని విమర్శించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి శ్రీ కొమురవెల్లి మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను యాదాద్రి భువనగిరి జిల్లాలోని గండి చెరువుకు మంత్రి హరీశ్ రావు నీటిని విడుదల చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత పాలకులు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాతే పొలాలకు నీళ్లు వచ్చాయని చెప్పారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తున్నామని తెలిపారు. అన్నిరంగాలకు 24 గంటలు కరెంటు ఇస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. ఆయిల్‌పామ్ సాగు పట్ల రైతులు ఆసక్తి చూపాలన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ నిలిచామన్నారు మంత్రి హరీశ్.