వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి గా హరీశ్ రావు బాధ్యతలు చేపట్టినప్పటినుండి నిరంతరం ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ నూతన విధానాలతో తెలంగాణ అభివృద్దికి పాటుపడుతున్నారు. ఈ క్రమం లోనే నేడు సిద్దిపేట లోని డబుల్ బెడ్‌రూం కేసీఆర్ నగర్‌లో రూ.18 లక్షలతో బస్తీ దవాఖాన నూతన భవన నిర్మాణం చేపట్టామన్నారు హరీశ్ రావు . ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణ లో భాగంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వ దవాఖాన వైద్య సేవల గురించి ప్రజలకు అర్దమయ్యే వదంగా చెప్పాలని, నార్మల్ డెలివరీలు తల్లి భవిష్యత్ ఆరోగ్యానికి చాలా మంచిదని,వీటిపై ప్రజల్లో అవగాహన కలిపించి, నార్మల్ డెలివరీలు జరిగేలా చూడాలని ఆశ, ఏఎన్ఎంలకు సూచించారు.
బస్తీ దవాఖానాల్లో ఇప్పటికి బీపీ, షుగర్‌తో సహా 57 రకాల వైద్య పరీక్షలను చేస్తున్నారని ,భవిష్యత్ లో మరికొన్ని నూతన వైద్య పరీక్షలు జరిగేలా ప్రణాళికలు చేస్తున్నామని పేర్కొన్నారు. సుమారు 150 రకాల మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఆయన తెలియచేశారు. స్వల్పంగా అనారోగ్యం బారిన పడిన వారికి తక్షణ వైద్య చికిత్స అందిస్తారని తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో కరోనా టీకాలు, తల్లి పిల్లల టీకాలు వేయడంతో పాటుగా కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన సలహాలు మరియు సూచనలను ఇస్తారన్నారు.