సెహ్వాగ్ రికార్డు బద్దలుకొట్టిన విరాట్‌..

503
kohli
- Advertisement -

భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి విజృంభించాడు.కోహ్లీ తన ఖాతాలో మరో రికార్డు నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ ఢిల్లీ డైనమైట్‌కు ఇది 7వ డబుల్ సెంచరీ.

తద్వారా భారత్ తరఫున అత్యధిక ద్విశతకాలు సాధించిన బ్యాట్స్ మన్ గా కోహ్లీ రికార్డు సృష్ఠించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. వీరూ 6 డబుల్ సెంచరీల రికార్డును ఢిల్లీకే చెందిన కోహ్లీ బద్దలు కొట్టడం విశేషం.

అంతే కాదు టెస్టు ఫార్మాట్‌లో ఏడు వేల ప‌రుగుల మైలురాయిని కూడా కోహ్లీ దాటేశాడు. 295 బంతుల్లో కోహ్లీ 200 ర‌న్స్ చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో 27 బౌండ‌రీలు ఉన్నాయి. ప్ర‌స్తుతం భార‌త్ 147 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 505 ర‌న్స్ చేసింది. కోహ్లీ 211, జ‌డేజా 38 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.

అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్‌లో డాన్ బ్రాడ్‌మాన్ అత్య‌ధికంగా 12 సార్లు డ‌బుల్ సెంచ‌రీలు చేశాడు. లంక క్రికెట‌ర్ సంగ‌క్క‌ర 11, విండీస్ క్రికెట‌ర్ బ్రియాన్ లారా 9 సార్లు డ‌బుల్ బాదారు. వ‌ల్లీ హ‌మ్మండ్‌, జ‌య‌వ‌ర్ధ‌నేలు కూడా ఏడుసార్లు డ‌బుల్ సెంచ‌రీలు న‌మోదు చేశారు.

- Advertisement -