బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతోందని…ఎన్నికల్లో గెలవగానే సన్నబియ్యం అందజేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. జహీరాబాద్, హద్నురులో ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన హరీష్..రాహుల్ గాంధీ కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇచ్చి 5 నెలలు అయ్యింది. ఎందుకు నెరవేర్చలేదు. అన్నారు. వ్యవసాయానికి 5 గంటల కరెంట్ వస్తున్నది. సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోలేక ప్రజల ఇబ్బంది పడ్డారన్నారు.కటుక వేస్తే వచ్చే కరెంట్ కావాలా, కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా ఆలోచించాలన్నారు.
కర్ణాటకలో 600 పెన్షన్ మాత్రమే. కళ్యాణ లక్ష్మి అక్కడ లేదు అన్నారు. కర్ణాటకలో అమలు చేయరు. గెలవని తెలంగాణలో హామీలు ఇస్తున్నారు….ఎకరాకు 16 వేల రైతు బంధు గెలిచాక ఇవ్వబోతున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో గ్రామానికి ఒకరిద్దరు ఆదర్శ రైతులు, కేసీఆర్ పాలనలో ఊరంతా ఆదర్శ రైతులు అన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయోద్దని కర్ణాటక ప్రజలు లబో దిబో అంటున్నారని…బిజెపి ఉండగా అక్కడ 7 గంటలు, కాంగ్రెస్ ఉండగా 5 గంటల కరెంట్ ఇస్తున్నారన్నారు.
5 గంటలు కావాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలి, 24 గంటలు కావాలంటే బి ఆర్ ఎస్ కు ఓటు వేయాలన్నారు. జనవరి నెల నుండి అసైన్డ్ భూములకు పట్టా ఇచ్చి హక్కులు కల్పిస్తాం అన్నారు.అరోగ్య శ్రీ 15 లక్షలకు పెంచబోతున్నాం అని…సౌభాగ్య లక్ష్మి పథకం కింద నెలకి 3000 ఇవ్వబోతున్నం అన్నారు. జహీరాబాద్ కు కాంగ్రెస్ పాపం గా మారిందని…. 12 సార్లు గెలిపించిన చేసిందేం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే నేడు పోదాం పద సర్కారు దవాఖాన అంటున్నారన్నారు. డయాలసిస్ సేవలు, ఐసియు వార్డులు తెచ్చాం అని…రైతు రుణమాఫీ అందరికీ జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి రాగానే అందిస్తాం అన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.
Also Read:పిక్ టాక్ : సొగసు ఘాటు పెంచేసింది