Harishrao:పెరిగిన బీఆర్ఎస్ గ్రాఫ్‌..

32
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్ములపొదిలో అస్త్రాలు ఒక్కొక్కటిగా వదులుతున్నారు… రాబోయే రోజుల్లో మరిన్ని అస్త్రాలు వదలడం ఖాయం అన్నారు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ వ్యూహాత్మక వ్యవహారశైలితో ప్రతిపక్షాలు ఖంగు తింటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెలువరిస్తున్న సంచలన నిర్ణయాలతో విపక్షాలకు ఊపిరి ఆడడం లేదని ఇవాళ అసెంబ్లీ లాబీల్లో మంత్రి హరీష్ రావు మీడియా చిట్ చాట్లో అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ను తక్కువ అంచనా వెయ్యద్దని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన అమ్ములపొదిలో ఎన్నో అస్త్రాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇకపై సీఎం రోజుకొకటి చొప్పున ఆ అస్త్రాలు వదిలిపెడతాడని మంత్రి హరీష్ వెల్లడించారు. ప్రజాక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న బీఆర్ఎస్ ను తట్టుకోవడం ప్రతిపక్షాల వల్ల కాదని ఆయన అన్నారు. కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడలకు రాబోయే రోజుల్లో విపక్షాలు విలవిలలాడటం ఖాయం అని అభిప్రాయపడ్డారు.

4 లక్షల 5 వేల మంది పై చిలుకు గిరిజనుల పోడు భూములకు పట్టాలు పంచడంతో తండాల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ అమాంతం పెరిగిందని మంత్రి హరీష్ రావు అన్నారు. పట్టలతో పాటు రైతుబంధు, రైతుబీమా కూడా వరిస్తుడటంతో గిరిజన గ్రామాల్లో బీఆర్ఎస్ కు ఓటింగ్ శాతం 3 నుంచి 4% పెరిగే అవకాశాలు ఏర్పడ్డాయని అన్నారు. ఇక వీఆర్ఏల క్రమబద్దీకరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం లాంటి నిర్ణయాలు ప్రజల్లో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ ను మరింత పెంచాయని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాజాగా పంట రుణమాఫీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ప్రభుత్వానికి తిరుగులేకుండా పోయిందని మంత్రి అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ అమ్ములపొదిలో నుంచి మరిన్ని ప్రజాకర్షక అస్త్రాలు రావడం తథ్యం అని హరీష్ రావు అన్నారు. ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం త్వరలోనే పే రివిజన్ కమిషన్ను ఏర్పాటు చేయడంతో పాటు, వాళ్లకు ఇంటరిమ్ రిలీఫ్ ను కూడా ప్రకటించే యోచనలో సీఎం ఉన్నట్లు వస్తున్న సమాచారం నేపథ్యంలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Also Read:కోకాపేట భూముల వేలం..ఎకరా 72 కోట్లు

ఇక తెలంగాణా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోడమే కాకుండా, ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లామని మంత్రి వెల్లడించారు. సాక్షాత్తూ అధికారగణమే ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్లకు వివరించారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డోకా లేదని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అభిప్రాయ పడ్డారు.

Also Read:ఆక్వా మెరైన్‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పిన సినీ ప్ర‌ముఖులు

- Advertisement -