కన్ఫర్మ్.. బీజేపీలోకి చీకోటి ఎంట్రీ?

66
- Advertisement -

క్యాసినో కింగ్ గా ఆ మద్య దేశ వ్యాప్తంగా వివాదాల్లోకి ఎక్కిన చీకోటి ప్రవీణ్ పోలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా ? చీకోటికి బీజేపీ రెడ్ కార్పెట్ పరుస్తోందా ? అంటే అవుననే అంటున్నాయి పోలిటికల్ వర్గాలు. గత కొన్నాళ్లుగా తన పోలిటికల్ ఎంట్రీపై తరచూ ఏదో ఒక సందర్భంలో హింట్ ఇస్తూనే ఉన్నారు చీకోటి. తనను అన్నీ పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయని, తాన రాజకీయ ఆరంగేట్రం కచ్చితంగా ఉంటుందని గతంలోనే స్పష్టం చేశారు చీకోటి ప్రవీణ్. అయితే ఏ పార్టీలో చేరతాడనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాను హిందూవాదినని హిందూత్వానికి అధిక ప్రదాన్యం ఇస్తానని ఈ మద్య తరచూ వ్యాఖ్యానిస్తున్నారాయన. .

ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే బీజేపీ వైపు ఆయన చూస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే హిందుత్వ ఎజెండా తో ఉన్న పార్టీ బీజేపీనే కాబట్టి ఆయన బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ నడిచింది. ఇప్పుడు ఆ వార్తలకు మరింత బలం చేకూరేలా కమలనాథులు వరుసగా చీకోటి ప్రవీణ్ తో భేటీ అవుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ మరియు ఉపాధ్యక్షురాలు డికె అరుణ చీకోటి తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంతో చీకోటి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమే అని రాజకీయ వర్గాల్లో వినికిడి. ఒకవేళ చీకోటి బీజేపీలో చేరితే ఏ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నారు ? ఇంతకీ కాషాయ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేస్తుందా లేదా సభ్యత్వానికే పరిమితం చేస్తుందా అనే విషయాలపై త్వరలోనే క్లారిటీ రానుంది. మొత్తానికి క్యాసినో రారాజు గా పేరు పొందిన చీకోటి రాజకీయాల్లో ఎంతమేర రాణిస్తారో చూడాలి.

Also Read:కోకాపేట భూముల వేలం..ఎకరా 72 కోట్లు

- Advertisement -