ఐదేళ్ల కాలంలో 73శాతం ఫిట్‌మెంట్‌ : హరీశ్‌రావు

62
- Advertisement -

ఐదేళ్లలో 73శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్ధిపేట జిల్లాకేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో ఎస్టీయూ 75 వసంతాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు, తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఏ విధంగా జరుపుకున్నామో.. ఇవాళ ఎస్టీయూ 75 వసంతాలు జరుపుకోవడం చాలా గర్వకారణమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో తెలంగాణ తరహాలో వేతనాలు లేవని, కేవలం తెలంగాణలోనే ఇస్తున్నామన్నారు. 75 ఏండ్లలో కానీ అభివృద్ధి 7 ఏండ్లలో చేసి చూపెట్టామన్నారు. విద్య, వైద్య రంగాన్ని అన్ని కోణాల్లో అభివృద్ధి చేస్తున్నామని, విద్యాశాఖతో పాటు ఇతర శాఖలను కలుపుకుని 12శాతం విద్యపై బడ్జెట్ పెట్టామన్నారు.

మన ఊరు-మనబడి కార్యక్రమానికి రూ.7,300 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టామన్నారు. ఉపాధ్యాయులకు కొన్ని సమస్యలు ఉన్నాయని, సాధ్యమైనంత వరకూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాన్నారు. ఈహెచ్ఎస్ పథకం అమలు కోసం సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. 75 ఏండ్లలో 5 మెడికల్ కళాశాలలు ఉంటే, ఏడేండ్ల కాలంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నామని….800 మెడికల్ సీట్లు నుంచి 2,840 మెడికల్ సీట్లను పెంచుకున్నామని ఈసందర్భంగా గుర్తు చేశారు.

- Advertisement -