మంత్రిగా కేటీఆర్… మన అదృష్టం

193
Harish Rao Praises KTR
- Advertisement -

రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖమంత్రిగా కేటీఆర్ ఉండటం మన అదృష్టమన్నారు హరీష్ రావు. సంగారెడ్డి జిల్లాలో మెడికల్ డివైజ్ పార్క్‌ను కేటీఆర్ తో కలిసి ప్రారంభించిన హరీష్  సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో ముందుకు దూసుకుపోతుందన్నారు. సంగారెడ్డి జిల్లాలో మెడికల్ డివైజ్ పార్క్ ఏర్పాటుకృషి చేసినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.కేటీఆర్ డైనమిక్ లీడర్‌ అని కితాబిచ్చారు.

తెలంగాణను కేటీఆర్‌ ఇండస్ట్రీయల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో వారానికి మూడు రోజులు పవర్ హలీడే ఉండేదని కానీ ఆ పరిస్ధితి మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వెల్లువలా వస్తున్నాయని తెలిపారు. ఉద్యమస్పూర్తితోనే పరిపాలనలో కూడా అదే స్పూర్తితో పనిచేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని హరీష్ స్పష్టం చేశారు. ఈ మెడికల్ డివైజ్‌తో అన్నిరకాల పరికరాలు తక్కువధరకే అందుబాటులోకి వస్తాయని పేద ప్రజలకు చాలా  ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఉద్యోగాల్లో స్ధానికులకే  అవకాశాలు ఇవ్వాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. భారతదేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజ్ పార్క్‌ ఇదన్నారు హరీష్.  పరిశ్రమలకు అనుమతుల విషయంలో పారదర్శకతను పాటిస్తున్నామని చెప్పారు. రానున్న కాలంలో రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు రావాలన్నారు.

ఈ మెడికల్ డివైజ్ పార్క్‌తో ఫార్మారంగంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ.. ఇక వైద్యపరికరాల ఉత్పత్తి-పరిశోధన- అభివృద్ధికి వేదిక కానుంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లోని 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ పార్కు దేశంలోనే మొదటిది కానుంది. ఉత్పత్తితోపాటు ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ రంగాలకు ఒకే చోట వేదిక కల్పిస్తూ మెడికల్ డివైజ్ పార్కు ఏర్పాటు చేయడం దేశంలోనే ఇది తొలిసారి. ఈ పార్కు వల్ల దేశీయ వైద్యపరికరాల అవసరాలు తీరడమే కాకుండా 20వేల మందికి ఉపాధి లభిస్తుంది.

- Advertisement -