టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ నేతలు..

18
TRS

సీఎం కేసీఆర్ చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నుండి భారీగా టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు.

వారికి మంత్రి పువ్వాడ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన వీరంతా ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై టీఆర్ఎస్‌లో చేరినట్లు వారు చెప్పారు. పార్టీలో చేరిన వారిలో భద్రాచలం పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నక్కా ప్రసాద్, యువజన నాయకులు లోకేష్, జిందా తదితరులు ఉన్నారు.