- Advertisement -
టీఆర్ఎస్ నేత,మంత్రి తన్నీరు హరీష్ రావుకు పెను ప్రమాదం తప్పింది. సంగారెడ్డిలో టీఆర్ఎస్ ప్రచారం కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. సంగారెడ్డిలో టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఓ చౌరస్తా వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. బైక్ ర్యాలీకి సమీపంలో బాణసంచా కాల్చడంతో టపాసులు పేలి కార్యకర్తలపై పడ్డాయి. దీంతో కార్యకర్తలు భయంతో పరుగులు తీశాయి. బాణసంచా పొగల్లో హరీశ్‌రావు చిక్కుకున్నారు. వెంటనే అప్రమత్తమైన హరీష్ భద్రతా సిబ్బంది ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. మంత్రితో పాటు ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -