కాంగ్రెస్, టీడీపీ పొత్తు అనైతికం

254
- Advertisement -

పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్రానికి అనేకసార్లు చంద్రబాబు లేఖ రాశారని.. ఎంతమంది చంద్రబాబులు వచ్చినా కల్వకుర్తి మోటర్లు ఆగవని మంత్రి హరీష్ రావు అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మర్రి జనార్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన టీఆర్ఎస్‌ కార్యకర్తల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆంద్రోళ్ల మోచేతుల నీళ్లు తాగేందుకు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అలవాటు పడ్డారని హరీష్‌రావు విమర్శించారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎక్కవ నీళ్లను తెలంగాణ వాళ్లు తీసుకుపోతున్నారని చంద్రబాబు ఢిల్లీలో ఫిర్యాదు చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు అనైతికమని వ్యాఖ్యానించిన ఆయన.. కల్వకుర్తికి నీళ్లవ్వని చంద్రబాబుతో ఎలా పొత్తు పెట్టుకున్నారని నిలదీశారు. ప్రాణహిత చేవేళ్లకు ఒక్క అనుమతి కూడా తీసుకురాలేదని.. నాగర్‌కర్నూల్‌లో ఒక గుంట కూడా తడపలేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంక్షేమంలో తెలంగాణ రాష్ట్ర దేశంలోనే నంబర్ వన్ గా ఉందని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, రైతులకు ఎరువులు, విత్తనాల కరువు ఏర్పడే దుస్థితి వస్తుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని.. చంద్రబాబు తెలంగాణకు మేలు చేసే వ్యక్తేనా..? అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని.. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

- Advertisement -