సంగారెడ్డిలో మంత్రి హరీశ్‌ సైకిల్ యాత్ర..

72
- Advertisement -

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నగర బాటలో భాగంగా పలు వార్డుల్లో సైకిల్ పై పర్యటన చేశారు మంత్రి హరీశ్‌ రావు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ స్థానికులు, మహిళలను కలుస్తూ సమస్యలు అడిగి తెలుసుకొని, వెంటనే పరిష్కారం చూపుతామని హామ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో సైకిల్ యాత్ర చేసి ఇంటింటికి వెళ్లి సమస్యలు గుర్తించామన్నారు.

గీతారెడ్డి రెండు సార్లు గెలిచినా, మంత్రిగా ఉన్నా అభివృద్ధి మాత్రం చేయలేదు. మాటలకే పరిమితం అయ్యారు తప్ప పనులు చేయలేదన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే మాణిక్యరావు కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రు. 50 కోట్లు జహీరాబాద్ పట్టణ అభివృద్ధి కోసం మంజూరు చేశారు. గతంలో కూడా జహీరాబాద్ పట్టణం కోసం 25 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. వీటితో ఫోర్ లైన్ రోడ్ లు, బటర్ ఫ్లై లైట్లు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నారు.

ఈరోజు జరిగిన సైకిల్ యాత్రతో ఏ ఏ వార్డుల్లో ఏ సమస్యలు ఉన్నాయి అని అధికారులతో కలిసి గుర్తించాము. అవసరం అయిన చోట నాలాలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోబోతున్నాం అన్నారు. జహీరాబాద్ ఒకప్పుడు నీళ్లు లేక ఇబ్బంది పడ్డ ప్రాంతం మిషన్ భగీరథ వల్ల ఆ సమస్యకు పరిష్కారం దొరికిందన్నారు.

- Advertisement -