సిద్ధిపేట క్రిస్మస్ సంబరాల్లో మంత్రి హరీష్ రావు

532
harish rao
- Advertisement -

క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించడం అన్నారురు మంత్రి హరీష్‌ రావు. సిద్దిపేట జిల్లాలో క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న హరీష్.. క్రీస్తు ప్రేమ,దయ,కరుణ అనే సందేశాన్ని ప్రపంచానికి అందించిన మహానుభావుడు అని తెలిపారు. తెలియక తప్పు చేసిన వారిని క్షమించాలని క్రీస్తు బోధించారని చెప్పారు.

క్రీస్తు చూపిన మార్గం లో అందరూ నడవాలని… బైబిల్ అయినా,ఖురాన్ అయినా,భగవద్గీత అయినా అందరూ కిలిసి మెలిసి జీవించాలని సందేశం ఇచ్చాయని చెప్పారు. చట్టాలు చేయని పనిని మత గ్రంధాల్లో బోధించిన మంచి మాటలు చేస్తాయని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ పండగ సందర్బంగా పేద క్రిస్టియన్ లకు బట్టలు పంపిణీ చేస్తున్నారని… ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అన్ని వర్గాల ప్రజల పట్ల ప్రేమ,దయ,కరుణ తో ఆదరిస్తున్నారని చెప్పారు. క్రీస్తు చూపిన మార్గం లో అందరూ నైతిక విలువలను పాటించాలని.. ఇవాళ్టి సమాజంలో మానవ సబంధాలు లేకుండా పోతున్నాయని..మానవ సంబంధాలను కాపాడాలన్నారు.

ప్రేమ ద్వారా,అహింస ద్వారా అనేక సమస్యలను పరిష్కరించకవచ్చన్నారు. క్రీస్తు ఆశీస్సులు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి ఇవ్వాలని ప్రార్థించాలని.. తెలంగాణ ప్రభుత్వం చర్చ్ ల మరమ్మతులకు,నిర్మాణాలకు నిధులు కేటాయిస్తుందన్నారు.

- Advertisement -