హరికథ…సిరీస్ బెస్ట్ మూవీ

3
- Advertisement -

సరికొత్త కంటెంట్ ను ఎప్పటికప్పుడు ఓటీటీ లవర్స్ కు అందిస్తోన్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ “హరికథ” అనే మరో సరికొత్త వెబ్ సిరీస్ ను తీసుకొస్తోంది. హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మ్యాగీ “హరికథ” సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి “హరికథ” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు “హరికథ” సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

రైటర్ సురేష్ జై మాట్లాడుతూ – కొన్నేళ్ల క్రితం నా మనసులో మొదలైన ఆలోచన ఇప్పుడు “హరికథ” సిరీస్ రూపంలో మీ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన హాట్ స్టార్ కు డైరెక్టర్ మ్యాగీ, పీపుల్ మీడియాకు థ్యాంక్స్. రాజేంద్రప్రసాద్ గారిని దృష్టిలో పెట్టుకునే ఈ కథను రెడీ చేశాను. మీ అందరికీ ఒక కొత్త అనుభూతిని కలిగించేలా సిరీస్ ఉంటుందన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శశికిరణ్ నారాయణ మాట్లాడుతూ – ఈ రోజు “హరికథ” ఈవెంట్ కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. ఈ స్టోరీ మా దగ్గరకు రెండేళ్ల క్రితం వచ్చింది. ప్యాషన్, హార్డ్ వర్క్ తో ఈ సిరీస్ చేశాం. మంచి టీమ్ తో వర్క్ చేసే అవకాశం “హరికథ” సిరీస్ తో దక్కింది. ఈ సిరీస్ కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. “హరికథ” కోసం మేమంతా ఎలా పనిచేశాం అనేది ఈ నెల 13న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో చూస్తారన్నారు.

సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ – “హరికథ” సిరీస్ కు వర్క్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. మ్యాగీ అన్న అద్భుతంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఇటీవల కాలంలో నేను చూసిన వెబ్ సిరీస్ లలో ఒక మంచి స్టాండర్డ్ , క్వాలిటీతో ఉన్న సిరీస్ “హరికథ” అనిపించింది. ప్రతి సీన్ గొప్పగా తీర్చిదిద్దారు. “హరికథ” పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు.

Also Read:Janasena:జాతీయ రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్ ?

- Advertisement -