విటమిన్-కె లోపిస్తే ప్రమాదమా?

41
- Advertisement -

మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినంతా పోషకాలు చాలా అవసరం. మన శరీరానికి కావలసిన పోషకాలాన్ని విటమిన్ల రూపంలోనూ మరియు ప్రోటీన్ల రూపంలోనూ లభిస్తాయి. కాబట్టి మనం తినే ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. మన శరీరానికి అవసరమయ్యే విటమిన్లు.. ఏ,సి, డి, ఇ బి కాంప్లెక్స్ మరియు విటమిన్ కె వంటి వాటిరూపంలో దొరుకుతాయి.. అయితే వీటిలో ఏ ఒక్కటి లోపించిన దాని పర్యవసానం మన శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి విటమినల్లో ముఖ్యమైనది విటమిన్ కె లోపిస్తే ఏం జరుగుతుంది? విటమిన్ కె లోపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం !

విటమిన్ కె అనేది మన శరీరంలో ఎముకలను బలపరచడానికి, గాయాలు అయినప్పుడు రక్తం గడ్డ కట్టడానికి, అలాగే వాటిని నయం చేయడానికి దోహదపడుతుంది. ఇంకా గుండెకు రక్త ప్రసరణను సవ్యంగా జరిగేలా చూస్తుంది. కాబట్టి మన శరీరంలో విటమిన్ కె అవసరత చాలానే ఉంది. కాగా విటమిన్ కె లోపం వల్ల చాలానే సమస్యలు చుట్టూ ముడతాయి. ముఖ్యంగా గుండె సమస్యలు పెరుగుతాయి. ప్రస్తుతం గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. హార్ట్ అటాక్, కార్డియాకరెస్ట్ వంటి సమస్యలు రావడానికి విటమిన్ కె లోపం కూడా ఒక కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read:హ్యాపీ బర్త్ డే…రవితేజ

విటమిన్ కె లోపించిన వారిలో పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా గాయాలు అయినప్పుడు అధిక రక్తస్రావం జరగడం, ఇంకా గోళ్ళ కిండా రక్తం గూడు కట్టడం, చిగుళ్ళ నుంచి రక్త స్రావం జరగడం, కీళ్ల నొప్పులు, వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా మూత్రంలో రక్తం, ఎముకల్లో నొప్పి వంటి లక్షణాలు కూడా విటమిన్ కె లోపానికి కారణం కావొచ్చు. కాబట్టి విటమిన్ కె లోపాన్ని అధిగమించేందుకు సరైన ఆహార పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలలో విటమిన్ కె సమృద్దిగా ఉంటుంది. ముఖ్యంగా బచ్చలి కూర, గోంగూర, తోట కూర, ఆకు కూర వంటి వాటిలో విటమిన్ కె ఉంటుంది. ఇంకా బ్లూ బెర్రిస్, అంజిర్, గుడ్లు, చీజ్ లివర్, సోయా బీన్స్, గ్రీన్ టి వంటి వాటిలో కూడా విటమిన్ కె లభిస్తుంది. కాబట్టి విటమిన్ కె లోపించకుండా ప్రతిరోజూ మన ఆహార డైట్ లో పైన చెప్పిన ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

 

- Advertisement -