హరిహర వీరమల్లు..డ‌బ్బింగ్ షురూ!

3
- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్‌.. మే 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ మూవీ పోస్ట్ ప్రోడక్ష‌న్ ప‌నులు వేగంగా జరుగుతున్నాయి. రీ రికార్డింగ్, వీఎఫ్ఎక్స్, డ‌బ్బింగ్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని.. మే 09 మాస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశ్వ‌రుపం చూడ‌డానికి సిద్ధంగా ఉండ‌డంటూ చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు‌‌.

Also Read:అణగారిన వర్గాల ఆశాజ్యోతి..ఫూలే

- Advertisement -