వీరమల్లు ట్రైలర్ ఎప్పుడంటే…

30
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గత కొంత కాలంగా బిజీగా ఉన్న పవన్ తాజాగా తను నటిస్తున్న సినిమాలపై దృష్టి పెట్టినట్టు టాలీవుడ్‌లో సమాచారం. ప్రస్తుతం సెట్‌ మీద ఉన్న హరిహర వీరమల్లు సినిమాపై ప్రేక్షకుల్లో భారీ లెవల్లో అంచనాలు పెట్టుకున్నారు. దానికి కారణం ఈ సినిమా దర్శకుడు క్రిష్‌ కావడము. క్రిష్ ఇప్పటివరకూ కమర్షియల్‌గా హిట్‌ కాలేకపోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న క్రిష్‌…పవన్‌ ఫస్ట్‌లుక్‌ గానీ టైటిల్ గ్లింప్స్‌గాని అభిమానులను ఆకట్టుకోలేదు.

అయితే దీన్నిపై అంచనాలు పెట్టుకున్న ప్రభావం ఏమేరకు ఉంటుందో చెప్పలేమంటున్నారు.  తాజాగా పవన్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్‌ ఒక్కసారిగా సినిమా అంచనాలను భారీగా పెంచింది. దీంతో ఈ సినిమా పై భారీ హైప్ పెరిగిన నేపథ్యంలో చిత్ర యూనిట్ మరో శుభవార్త త్వరలో ప్రకటించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని…దీనికి ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.

రిపబ్లిక్‌డే సందర్భంగా హరిహరవీరమల్లు ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. 17వ శతాబ్ధం నాటి మొఘలాయిలు కుతుబ్‌షాహీల కాలం నాటి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా…మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా నిధిఆగర్వాల్‌ నర్గీస్ ఫక్రిలు నటిస్తున్నారు. గోల్డెన్ గ్లోబ్ విన్నర్‌ ఎంఎం కిరవాణి సంగీత బాణీలు అందించనున్నారు.

ఇవి కూడా చదవండి…

స్టార్లకు అరుదైన గౌరవాలు

యంగ్ డైరెక్టర్స్ తో రజినీ ?

బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అభిమానులు

- Advertisement -