సంక్రాంతికి హరిహర వీరమల్లు!

74
pawan
- Advertisement -

క్రిష్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. మొఘల్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌తో 17వ శతాబ్దానికి చెందిన కథతో వస్తున్నారు పవన్‌. పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడురు.

టీజర్‌తోనే హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.

దీంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్ చేస్తున్నారు పవన్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించబోతోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -