- Advertisement -
టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న హార్ధిక్ పాండ్య విశ్వరూపం చూపించాడు. డీవై పాటిల్ టీ20 కప్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఏకంగా 37 బంతుల్లో సెంచరీ చేసి గ్రౌండ్ నలుమూలల బంతిని పరుగులు పెట్టించాడు.
హార్ధిక్ ధాటి ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 252 పరుగులు చేసింది. టోర్నీలో రిలయన్స్-1 జట్టు తరఫున ఆడుతున్న హార్దిక్ ..105 పరుగులు చేసి సత్తాచాటాడు. పది సిక్సర్లు,ఎనిమిది ఫోర్లతో ఏ ఒక్క బౌలర్‌ను విడిచిపెట్టకుండా బంతిని వీరబాదుడు బాదాడు.
అనంతరం హార్దిక్ పాండ్య బౌలింగ్‌లోనూ రాణించి ఐదు వికెట్లు తీయడంతో కాగ్ 151పరుగులకే ఆలౌటైంది.ఐదు నెలల క్రితం వెన్నుకు శస్త్రచికిత్స చే యించుకున్న పాండ్య అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యారు.
https://twitter.com/Viratgalaxy18/status/1234827540239224837
- Advertisement -