- Advertisement -
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాటలోనే పయనిస్తున్నాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. న్యూ ఇయర్ సందర్భంగా తన ప్రేమ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు హార్దిక్. నటి నటాషా స్టాన్ కోవిచ్తో తాను ప్రేమలో ఉన్నానని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
వెన్నునొప్పి కారణంగా కొంతకాలంగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న హార్దిక్ ఇటలీలో సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం ముంబయి తరఫున దేశవాళీ క్రికెట్ రంజీల్లో ఆడుతున్నాడు. త్వరలో న్యూజిలాండ్ టూర్‌కి భారత్ వెళ్లనుండగా పాండ్యా ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
2016లో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన పాండ్యా.. అనతికాలంలోనే అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌తో కీలకమైన సిరీస్‌లకి దూరమయ్యాడు. ఈ ఏడాది టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చి సత్తాచాటాలని భావిస్తున్నాడు.
- Advertisement -