IPL:ముంబై ఓటమిపై హార్ధిక్

11
- Advertisement -

ఐపీఎల్ (IPL) చరిత్రలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ కష్టాలు కొనసాగుతున్నాయి. వరుసగా మూడవ మ్యాచ్‌లోనూ ఓటమి పాలవ్వడంతో, జట్టులో మార్పులు రావాల్సిన అవసరం ఉందని కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పష్టం చేశారు.

ప్రస్తుత సీజన్‌లో ముంబై ప్రయాణం ఆశాజనకంగా సాగడం లేదు. తొలి మ్యాచ్‌లో విజయంతో బోణీ కొట్టినప్పటికీ, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి లయను కోల్పోయింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయం, మూడు ఓటములతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తాజా మ్యాచ్‌లో ఓటమి అనంతరం హార్దిక్ పాండ్యా పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో మాట్లాడుతూ.. జట్టు వ్యూహాలను పునరాలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

మేము నిజంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. జట్టుకు అవసరమైన ఆ ఊపు ఎలా తీసుకురావాలి, ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయనేది చూసుకోవాలి. మాకు రెండు రోజులు విరామం ఉంది, ఆ తర్వాత మళ్లీ బరిలోకి దిగుతాం. నిజం చెప్పాలంటే.. ఇప్పుడు చాలా విషయాల గురించి మళ్లీ ఆలోచించాలి. ప్రస్తుత వ్యూహాలు పని చేయడం లేదు. గత కొన్ని మ్యాచ్‌ల్లో టాస్ గెలిచినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. కాబట్టి బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో మాకున్న ఇతర ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది,” అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నారు.

వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఏప్రిల్ 26న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

Also Read:వరుణ్ తేజ్..’కొరియన్ కనకరాజు’!

- Advertisement -