భారతీయ సంగీత ప్రపంచంలో ఒక అద్భుత అధ్యాయం ముగిసింది. లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఆశా భోస్లే (92) ఆదివారం (ఏప్రిల్ 12) ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ (అనేక అవయవాలు విఫలం కావడం) కారణంగా తుది శ్వాస విడిచారు.
నేడు (ఏప్రిల్ 13, 2026) ముంబైలోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆశా భోస్లే మరణవార్త తెలియగానే సంగీత, సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. ఆమె భౌతిక కాయాన్ని తుది దర్శనం కోసం ముంబైలోని ఆమె నివాసం ‘కాసా గ్రాండే’లో ఉంచారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆమె నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.భారతదేశం గర్వించదగ్గ అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయాం. ఆమె అసాధారణమైన సంగీత ప్రయాణం తరతరాలకు స్ఫూర్తిదాయకం” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
మీ గాత్రం మా హృదయాల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది” అంటూ సింగర్ నీతి మోహన్ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.ఉదయం 10:30 – మధ్యాహ్నం 2:00: లోయర్ పరేల్‌లోని ఆమె నివాసంలో ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఉంచుతారు.
Also Read:వరుణ్ తేజ్..’కొరియన్ కనకరాజు’!
మధ్యాహ్నం 4:00: శివాజీ పార్క్ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు ప్రారంభమవుతాయి. దాదాపు 70 ఏళ్లకు పైగా సాగిన తన కెరీర్‌లో ఆశా భోస్లే వేల సంఖ్యలో పాటలు పాడారు. మెలోడీలు, క్లాసికల్, పాప్, క్లబ్ సాంగ్స్.. ఇలా ఆమె పాడని జానర్ లేదు. తెలుగులోనూ ఆమె అనేక మధురమైన పాటలకు ప్రాణం పోశారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది.

